సాయంత్రం వేళలో నవ గ్రహాలకు ప్రదక్షిణాలు చేయవచ్చా?

-

సాధారణంగా దేవాలయానికి ఎక్కువమంది ప్రాతఃకాలంలో వెళ్తారు. ముఖ్యంగా నవగ్రహాల దగ్గరకు అయితే చాలామంది పొద్దునే వెళ్లి ప్రదక్షణలు చేస్తారు. అయితే సాయంత్రం వేళలో నవగ్రహాల దగ్గరకు వెళ్లవచ్చా తెలుసుకుందాం…

సాయంత్రం వేళలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయకూడదు అని ఎవరూ చెప్పలేదు. చేయవవచ్చు. అయితే ఉదయం వేళలో మనం స్నానం చేసి శుచిగా శుభ్రం గా ఉండడం వలన మన మనస్సు కూడా ప్రశాంతం గా ఉంటుంది. కాబట్టి ఉదయం వేళలో దేవాలయం సందర్శించడం మంచిది అన్నారు. అలాగే నవ గ్రహాలకు నవ గ్రహ స్తోత్రం చదువుతూ 9 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ అనంతరం మన కాళ్ళపై నీళ్ళు జల్లుకొని ఆ నీళ్ళు కనులకు అద్దుకోవాలి; ఎందుకంటే. నవ గ్రహ ప్రదక్షిణ సమయం లో మన కాళ్ళపై శని దృష్టి సారిస్తాడు; కాబట్టి కాళ్ళు పూర్తిగా కడక్కుండా; నీళ్ళు మాత్రం జల్లుకోవాలి.

ఆయా ప్రాంతాలలో అక్కడి ఆచారాలను పట్టి కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటిస్తారు. వాటిలో తప్పు పట్టనక్కర్లేదు. వీటితోపాటు ఆయా గ్రహదోషాలకు పండితులు చెప్పిన విధానంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా ఆయా హోరలో అయా గ్రహప్రదక్షణ చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఏ ప్రదక్షణమైనా భక్తి,శ్రద్ధతో, శుచి, శుభ్రతతో చేస్తేనే ఫలితం వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. మీకు అవకాశం దొరికినప్పుడు అంటే ఉదయం లేదా సాయంత్రం శుచితో, భక్తితో ప్రదక్షణలు చేయండి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news