భక్తి: ఆరోగ్యం, ధనం ఉండాలంటే ఈ తప్పులు చెయ్యకండి…!

-

ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ధనంతో ఉండాలని అనుకుంటారు. అయితే కొన్ని తప్పుల కారణంగా ఇవి మన వద్ద ఉండకుండా పోతాయి. మీరు ఆనందంగా మరియు ధనం తో ఉండాలనుకుంటే పండితులు చెబుతున్న ఈ విషయాలని పాటించండి.

దీనితో మీరు ఆనందంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. మరి వాటి కోసం ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం… ఉదయం మీరు నిద్ర లేవగానే మీ అర చేతిని చూసుకుని లేవాలి. ఎందుకంటే ఈ విధంగా పాటించడం వల్ల మహా లక్ష్మి దేవి, సరస్వతి మరియు విష్ణు మూర్తి ఆశీస్సులు ఇస్తారని పండితులు అంటున్నారు.

ఆ తర్వాత కాళ్ళు కింద పెట్టిన తర్వాత భూదేవికి నమస్కారం చేసుకోవాలని చెబుతున్నారు. ప్రతి రోజు కూడా స్నానం చేసిన తర్వాత దేవుడికి పూజ చేయాలి. ఇంట్లో ఉండే దేవుడికి మంచిగా అలంకారం చేసి పూజ చేస్తూ ఉండాలి.

అదే విధంగా ప్రతి రోజు సూర్య నారాయణ మూర్తికి నీళ్లు అర్పించాలి. అలానే భోజనం చేసే ముందు మొదట ఏదైనా జీవికి పెట్టి ఆ తర్వాత తినాలి. ఈ విధంగా మీరు ప్రతి రోజూ పాటిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి మరియు ధనం ఆరోగ్యం కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version