ప్రతి ఒక్క హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని హిందూలు అందరు కూడా పూజిస్తారు. తులసి మొక్క ముందు దీపాలని కూడా వెలిగిస్తారు. సనాతన ధర్మంలో తులసి మొక్క కి ఉన్న ప్రాధాన్యత ఇంత అంత కాదు. తులసి మొక్కని పూజిస్తే సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. తులసి మొక్క ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.
శివలింగాన్ని పొరపాటున తులసి మొక్క దగ్గర పెట్టకూడదు తులసి మహావిష్ణువుకి ప్రియమైనది. జలంధరుడు అనే రాక్షసుని భార్య అయిన తులసికి పూర్వజన్మలో బృందా అని పేరు ఉండేది. అయితే జలంధరుడు దౌర్జన్యం వలన శివుడు అతన్ని చంపాడు ఈ కారణంగానే శివుడి పూజ లో తులసి మొక్కని ఉపయోగించరు.
అలానే తులసి మొక్క దగ్గర వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టకూడదు. వినాయకుడి పూజలో కూడా వాడరు.
చీపురుని కూడా తులసి మొక్క దగ్గర పెట్టకండి ఎందుకంటే మనం ఇంటిని శుభ్రం చేయడానికి చీపురుని వాడతాము. చీపురు తులసి మొక్క దగ్గర ఉంటే దరిద్రం వస్తుంది. తులసి మొక్క దగ్గర షూ, చెప్పులు వంటివి కూడా ఉంచకూడదు. ఇవి కూడా సమస్యల్ని కలిగిస్తాయి కాబట్టి ఈ తప్పును కూడా చేయొద్దు.
చెత్తబుట్టని కూడా తులసి మొక్క దగ్గర పెట్టకూడదు. కాబట్టి ఈ తప్పులని అస్సలు చెయ్యద్దు. చాలా మంది తెలీక ఈ తప్పులని చేస్తూ వుంటారు.