ఏ దానం చేస్తే ఏం ఫలమో మీకు తెలుసా

-

దానం… అన్నదానం, వస్త్రదానం, ధాన్యదానం.. ఇలా షోడశదానాలు ఉన్నాయి. అవి కాకుండా ఆధునిక కాలంలో మరికొన్ని దానాలు వచ్చాయి. మనిషి పుట్టినప్పటి నుంచి పోయిన తర్వాతి వరకు రకరకాల దానాలు ఇస్తుంటారు. శుభ, అశుభ కార్యాలలో కూడా దానం పాత్ర కీలకం. వివాహ కాలంలో కూడా దానాలు చేస్తారు. ఇక పోయినప్పుడు సంగతి చెప్పనక్కర్లేదు. అలాగే యాగాలు, హోమాలు చేసినప్పుడు సైతం గోదానం, హిరణ్య దానం, వస్త్ర దానం వంటివి అనేకం చేస్తారు. అయితే ఏయే దానాలు చేస్తే ఏం ఫలితం వస్తుందో దాన చింతామణి గ్రంధములో పేర్కొన్న విషయాలు తెలుసుకుందాం…శాస్త్రం ప్రకారం

ప్రతి మనిషి తన శక్తి మేరకు దానం చేయవలసినదే. దానం అనేది ఉన్నవాడికో లేక కావాల్సిన వాడికో ఇవ్వడం కాదు మన ఇచ్చే దానం తీసుకున్న వారికి ఉపయోగ పడే విధముగాను అవశ్యంగాను వుండేటట్టు చూసి ఇవ్వాలి.

వేర్వేరు వస్తువుల దానములు, దాని ఫలితములు ..

వస్త్ర దానం – ఆయుష్ వృద్ది

మి దానం – బ్రహ్మలోక ప్రాప్తి

తేన – పుత్ర భాగ్యం కాంస్య పాత్రములో ఇవ్వాలి

గోదానము – ఋషి, దేవా, పితృ ప్రీతి

ఉసిరిక దానం – జ్ఞాన ప్రాప్తి

కోవెలలో దీప దానం చక్రవర్తి పదవి అంటే జీవితంలో అత్యున్నత పదవి ప్ర్రాప్తం

దీప దానం – పార్వ లోపం తీరును
గింజల దానం – దీర్ఘ అయుష్షు శాంతి

బియ్యం – అన్ని రకములైన పాప నివృత్తి

తాంబూలం – స్వర్గ ప్రాప్తి

కంబలి దానం – వాయురోగ నివృత్తి

పత్తి – కుష్టం తీరును

ఉపవీతం (జంధ్యం) -బ్రాహ్మణజన్మ లభిస్తుంది
పుష్పం, తులసి – స్వర్గ ప్రాప్తి

నేయి దానం – రోగ నివృత్తి

ఇవేకాకుండా ఆధునిక కాలంలో విద్యాదానం, రక్తదానం, అవయవ దానాలు కూడా చేరాయి. వీటిని ఇవ్వడం వల్ల పుణ్యంతోపాటు భగవదనుగ్రహం లభిస్తుంది.మరో ముఖ్యమైన విషయం దానం ఇచ్చేవాడు దానం తీసుకునేవారిని పేదలుగా, లేనివాడుగా, అల్పుడుగా భావించి ఇవ్వరాదు. దానం తీసుకునే వారిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించి ఇవ్వాలి. అప్పుడు సంపూర్ణ ఫలం లభిస్తుంది..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version