విజయవాడ మహానగరంలో వరదలు విజృంభించిన నేపథ్యంలో… చంద్రబాబు నాయుడు పై 8 ప్రశ్నలతో విరుచుకుపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విజయవాడ వరదలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కారణమని ఫైరయ్యారు. బుడమేరు విషయంలో అప్రమత్తత లేకపోవడం వల్ల వరదలు వచ్చాయని తెలిపారు.
ఇక వరద బాధితులను కాపాడే నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప… జనాలకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. ఇక బాధితులకు బియ్యం అలాగే నిత్యవసర సరుకులు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం కంటే వైసీపీ పార్టీ ఎక్కువ స్థాయిలో సహాయం చేస్తుందని కొనియాడారు. విజయవాడ వరద బాధితులకు.. ఒక పథకం అమలు చేసి వారికి న్యాయం చేయాలని.. డిమాండ్ చేస్తూ ఎనిమిది ప్రశ్నలు సంధించారు జగన్మోహన్ రెడ్డి.