దేవుడు దగ్గర కొబ్బిరి కాయను ఎందుకు కొడతారో తెలుసా..?

-

మన హిందూ సంప్రదాయం లో కొబ్బరి కాయ కు చాలా ప్రాధాన్యం ఉంది.గుడికి వెళ్ళినా, ఏదైనా మంచి పని మొదలు పెట్టాలన్నా కొబ్బరి కాయ కొట్టి మొదలు పెడతారు. అయితే కొబ్బరి కాయనే ఎందుకు కొడతారు? మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడుకొబ్బరి కాయ కొట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది.కొబ్బరి కాయ దేవుడు ముందు కొట్టడం వల్ల మనిషి లో ఉన్న అహంకారం పటాపంచలు అవుతుంది.

అదెలా అంటే మన పుర్వికుల నుండి కొబ్బరి కాయని మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి పీచుని మనిషి జుట్టుతో పోల్చారు. దాని ఆకారాన్ని మనిషి ముఖం గాను, అందులో నీటిని రక్తంగాను పోలుస్తారు. అందులో ఉండే కొబ్బరిని మన మనస్సుగా భావిస్తారు. అందుకే కొబ్బరి కాయ కొట్టడం వల్ల మనసులో ఉండే కల్మషం, అహంకారం అన్ని పోతాయి.అయితే కొంత మందికి కొబ్బరి కాయ కొట్టినప్పుడు పువ్వు,లేదా కుళ్ళి పోవడం జరుగుతుంది. దీని వల్ల అందరు భయపడతారు.

ఇలా కుళ్ళిపోవడం కీడుగా భావిస్తారు. అయితే దీని వల్ల నష్టం జరగదు అని పురోహితులు చెప్తున్నారు .ఇలా జరిగినపుడు దాన్నీ అవతల పడేసి చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. కొబ్బరిలో పువ్వు వస్తే మంచిదిగా భావించవచ్చు. కొత్తగా పెళ్ళైన జంట కొబ్బరి కాయ కొట్టినపుడు  పువ్వు వస్తే వారికి పిల్లలు పుడతారని నమ్మకం. కొబ్బరి కాయ సమానంగా పగిలితే మనసులో కోరిక నెరవేరుతుందని భావిస్తారు. ఏ దేవుడికైనా భక్తితో పూజ చేసి కొబ్బరి కాయ నివేదన చేస్తే సరిపోతుంది. వేరే ఏ విధమైన నైవేద్యం అవసరం లేదు. ఎన్ని రకాల నైవేద్యాలు ఉన్న కొబ్బరి కాయ కొట్టనిదె పూజ పూర్తి కాదు. అందుకే కొబ్బరి కాయ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news