ఆషాడమాసంలో ఒకే గడప డాటకూడదు అంటారు ఎందుకో తెలుసా..?

ఆషాడం నెల తెలుగు నెలల్లో 4వది. ఆషాడం ఎండాకాలంకు మరియు వానా కాలం కు మధ్యలో వస్తుంది.ఈ కాలంలో ఎండలు అధికంగా లేకున్నా వాతావరణ మార్పులు వల్ల వేడిగాను ఉక్కగాను ఉండి మనుషులకు చికాగు పెట్టేకాలం.ఈకాలంలో సీజన్ మార్పులు వల్ల కలిగే జ్వరాలు, జలుబులు ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో అత్త కోడలు ఒకే ఇంట్లో వుంటే చికాగు వల్ల ఏమైనా పోరాపొచ్చలు వస్తే జీవితాంతం గుర్తుపెట్టుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్తకోడళ్ళు ఒకే గుమ్మం లో నడవకూడదు అంటారు మన పెద్దలు.

అంతేకాక దీనికి మరొక కారణం వుంది.సాధారణంగా తెలుగు నెలల్లో మొదటి నెల అయినా చైత్ర మాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఆడపిల్లలకు పుట్టినిట్టిపై బెంగ ఉంటుంది కానీ వెళ్లలేక బాధపడుతుంటారు. ఇలా ఒక నెలపాటు కొత్తగా పెళ్లయినా అమ్మాయి వాళ్ళ పుట్టినయింట్లో గడిపే అవకాశం కలుగుతుందంటారు పెద్దలు.

ఈ ఆచారానికి ప్రధాన కారణం ఆషాడం లోనే తొలకరి పడతాయి. భారతదేశం వ్యవసాయక దేశం. ప్రజలు ప్రధాన జీవనాదారం వ్యవసాయమే.సంవత్సరఆహారం ఈ నెలలో వేసే పంటపైనే ఆధారపడి ఉంటుంది.తొలకరిజల్లులు పడగానే పొలం దున్నడం, పంటలు వేయడం మొదలు పెట్టె సమయం కాబట్టి ఈ సమయంలో కొత్త జంట పెళ్లివ్యామోహంలో పడి వ్యవసాయాన్ని అశ్రద్ధ చేయకూడదనే ఉద్దేశ్యం తో భార్య భర్తను వేరుగా ఉంచుతారు.ఈ విషయాన్నే కాళిదాసు తన మేఘధూత కలకాండలో వివరించాడు. ఏ మగాడయినా ఆడదాని పై వున్న వ్యామోహం తో కార్యాలయంలో చేయవలసిన పనిపై ద్రుష్టి సారించడు అని వివరిస్తాడు.

ఈ సమయంలో గర్భధారణ జరిగి గర్భం దాల్చితే సరైనా శిశువులు జన్మించడం కష్టం. ఈ జాగ్రత్తను ఎక్కువగా మొదటి సంతానం పైనే తీసుకుంటారు. అందుకే అప్పుడే పెళ్లయినా భార్య భర్తలు మొదటి సంవత్సరం ఒకరి పై ఒకరికి వ్యామోహం, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భార్యభర్తను దూరంగా ఉంచడానికి ఈ ఆచారాన్ని అనుసరిస్తుంటారు.