శివుడు పులి చర్మంపై ఎందుకు కూర్చుంటాడో తెలుసా?

-

శివాలయంలో శివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం శివుడు విగ్రహం ఉంటుంది.. అయితే విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే శివుడు పులి చర్మంపై ధ్యానముగ్ధుడై కూర్చుంటాడు. ఈ సృష్టిలో ఎన్ని రకాల జంతువులు ఉండగా కేవలం పులి చర్మం పైన ఎందుకు శివుడు కూర్చుంటాడు అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. శివుడు అలా పులి చర్మం మీద మాత్రమే కూర్చోవడం వెనక ఒక పెద్దగా చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు..


శంకరుడు సర్వసంగ పరిత్యాగి. దిగంబరుడిగా అరణ్యాలు, శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజు ఆ మార్గంలో వెళుతున్న శివుడినిని చూసిన మునికాంతలు.. ఆ తేజస్సుకి,సౌందర్యానికి చూపు తిప్పుకోలేకపోయారు. నిత్యం ఆయన్ను చూడాలనే కాంక్ష మునికాంతల్లో పెరిగింది. గృహంలో నిర్వహించాల్సిన దైవ కార్యాలు, నిత్యకృత్యాలు కూడా శివుడుని తలుచుకుంటూనే చేయసాగారు. తమ భార్యల్లో ఎప్పుడేలేని ఈ మార్పునకు కారణం ఏంటా అని ఆలోచనలో పడిన మునులకు పరమేశ్వరుడిని చూసి ఒక ఆలోచనకు వచ్చారు..

శివుడిని దారి మారల్చాలని ఓ గుంత తవ్వి పులిని బయటకు వచ్చేలా చేశారు.. తర్వాత శివుడు వారి ఆలోచనను గ్రహించి తనపై ఎగబడిన పులిని సంహారిస్తాడు..మునుల చర్య వెనుకున్న ఉద్దేశం గ్రహించి పులితోలుని తన దిగంబర శరీరానికి కప్పుకున్నాడు. పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక, సంహారకారి, భయానకమైనది. అలాంటి పులి కూడా లయకారుడైన పరమేశుని ఎదుట నిలవలేదని, కాల స్వరూపుని ఎదుట నిలబడ గలది ఏదీ లేదని చెప్పడమే ఇందులో అర్థం.. అది శివునికి, పులి చర్మానికి ఉన్న బంధం.. అప్పటి నుంచి శివుడి పులిచర్మాన్ని వాడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version