ప్ర’పంచ’ దంపతులు అని ఎవరినంటారో తెలుసా?

-

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నారు. వారందరిలో కొన్ని గుణాలు ఒకేలా ఉంటాయి. మన పూర్వీకులు ప్రపచంలోని దంపతులను ఐదురకాలుగా వర్గీకరించారు. వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు. ఆ ఐదు రకాల జంటలే మనకు ఆదర్శం. ఆ దంపతులు ఎవరో, వారి విశేషాలు తెలుసుకుందాం…

లక్ష్మీనారాయణులుః మొదటి జంట లక్ష్మీనారాయణులు. విష్ణుమూర్తి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మీ ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట అని చెప్పుకోవచ్చు.

గౌరీశంకరులుః ఇక రెండో రకం జంట గౌరీశంకరుల జంట. గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం. తల నుంచి కాలిబొటనవ్రేలి వరకు నిట్టనిలువునా చెరి సగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత, ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,
కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య, ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

బ్రహ్మసరస్వతీః ఇక మూడో జంట బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

ఛాయాసూర్యులుః నాల్గో జంట ఛాయాసూర్యులుగా చెప్తారు. ఛాయా సూర్యులు సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా, పట్టుదలతో ఉంటాడో… ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంటగా చెప్పుకోవచ్చు.

రోహిణీ చంద్రులుః ఐదో జంట రోహిణీచంద్రుల జంట. రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది. చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని,
ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ, ఏ జంట భర్త మెత్తగా ఉండి, లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులుగా చెప్తారు.
అదండీ సంగతి. ఇలా లోకంలో దాదాపు అన్ని జంటలు ఈ ఐదు రకాలల్లో ఏదో ఒక రకంగానో లేక వాటి మిశ్రమంగానో ఉంటాయి అనడంలో సందేహం లేదు.
– కేశవ
శివపార్వతి, లక్ష్మీనారాయణుల ఫటో వాడగలరు

Read more RELATED
Recommended to you

Exit mobile version