ఏకాదశరుద్రులు, ద్వాదశాధిత్యులు అంటే ఎవరు?

-

పురాణ ఇతిహాసాలలో చెప్పే పలు విషయాలు అత్యంత ఆసక్తిగా ఉంటాయి. చాలావాటికి సారూప్యతలు ఉంటాయి. శివ స్వరూపమైన రుద్రులు ఏకాదశంగా అంటే 11 ప్రధానమైనది. అదేవిధంగా 12 మంది సూర్యులను ప్రధానంగా అర్చిస్తాం. ఆయా రుద్రులు, ఆదిత్యులు ఎవరు, వారి పేర్లు తెలుసుకుందాం…

”శివోమహేశ్వర: శంభు: శ్రీ కంఠోభవ ఈశ్వర:
మహాదేవ: పశుపతి: నీలకంఠో వృషధ్వజ:
పరమేశ ఇమే రుద్రా, ఏకాదశ సమీరితా:”

అని శివతత్త్వ రత్నాకరం. దీనిని బట్టి 1. శివుడు, 2. మహేశ్వరుడు, 3. శంభుడు, 4. శ్రీకంఠుడు, 5. భవుడు, 6. ఈశ్వరుడు, 7. మహాదేవుడు, 8. పశుపతి, 9. నీలకంఠుడు, 10. వృషధ్వజుడు, 11. పరమేశుడు అనువారు ఏకాదశరుద్రులు.
మరో పక్షాన్నిఅనుసరించి – 1. అజుడు, 2. ఏకాపాదుడు, 3. అహిర్భుధ్న్యుడు , 4. త్వష్ట, 5. రుద్రుడు, 6. హరుడు, 7. శంభుడు, 8. త్ర్యంబకుడు, 9. అపరాజితుడు, 10. ఈశానుడు, 11. త్రిభువనుడు ఏకాదశరుద్రులుగా పేర్కొనబడ్డారు.
ఇంకా కొన్ని మతభేదాలు ఉన్నాయి. వాటి ప్రకారం పై పేర్లలో కొన్నింటికి బదులు వృషాకపి, కపర్ది, శర్వుడు మొదలైన పేర్లు వినబడుతున్నాయి.
ఇదేవిధంగా ద్వాదశాదిత్యులు విషయంలో కూడా భేదాలు కనబడుతున్నాయి. ఒక మతాన్ని అనుసరించి ఈ క్రిందివారు ద్వాదశాదిత్యులవుతారు. 1. ధాత, 2. మిత్రుడు, 3. అర్యముడు, 4. శుక్రుడు, 5. వరుణుడు, 6. అంశుడు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పుమ్షుడు, 10. సవిత, 11. త్వష్ట 12. విష్ణువు.
మరోక పక్షంలో వీటిలో కొన్ని పేర్లకు బదులు –

1. జయంతుడు, 2. భాస్కరుడు, 3. భానుడు, 4. హిరణ్యగర్భుడు, 5. ఆదిత్యుడు ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడివున్నాయి.
హిందువులు పరమ పవిత్రంగా భావించే వారణాశి నగరంలో ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలు ఉన్నాయి. ఆయా దేవాలయాల వద్దఆయా మాసాల్లో ప్రత్యేక పూజాకార్యక్రమాలను చేస్తారు. వీటిపై ఇటీవల శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. అక్కడ అత్యంత ఎక్కువ కాస్మిక్‌ ఎనర్జీ వస్తుందని నిరూపణ కూడా కావడం మరో విశేషం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news