ఒక్కో దేశానికి ఒక్కో రూల్ ఉంటుంది. ఆ రూల్ అతిక్రమిస్తే మాత్రం శిక్షలు ఖటినంగా ఉంటాయి. మనం చిన్న చిన్న విషయాలు అనుకునే ఎన్నో వాటికి ఇతర దేశాలలో వెన్నులో వణుకు పుట్టించే శిక్షలు ఉంటాయి. అలాంటి శిక్షనే ఇప్పుడు సింగపూర్ లో అనుభవిస్తున్నాడు ఓ భారతీయుడు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏమిటంటే..సింగపూర్ లో ఓ ప్రాంతంలో బాణాసంచా కాల్చడమే..వివరాలలోకి వెళ్తే…
సింగపూర్ లో కొన్నేళ్ళ క్రితం స్థిరపడిన మురుగన్ స్థానికంగా లిటిల్ ఇండియా ప్రాంతంలో బాణాసంచా కాల్చాడు. సింగపూర్ లో బాణాసంచా కాల్చచ్చు తప్పులేదు అందుకు నిభందనలు కూడా ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలలో కాల్చడానికి వీలులేదు. కానీ అతడు అలంటి ప్రాంతంలో బాణాసంచా పేల్చడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి మురుగన్ చేసిన ఈ నేరంపై విచారణ చేసి అతడికి జైలు శిక్షని ఖరారు చేస్తున్న క్రమంలో
తనకి ఇటువంటి నిభందన గూర్చి తెలియదని, తెలియక చేసిన తప్పిదంగా భావించి తనకి బెయిల్ ఇవ్వాలని అభ్యర్ధించాడు. దాంతో న్యాయమూర్తి అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశాడు. కానీ నేరం రుజువయ్యితే మాత్రం మురుగన్ కి రెండేళ్ళ జైలు శిక్ష తో పాటు 5 లక్షల భారీ జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ఇలాంటి పరిస్థితి ఇండియాలో ఉంటే ఎంత మంది అరెస్ట్ అవుతారో అంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారు భారతీయులు..