శివుడుని ఆరాధించేటప్పుడు ఇలా చేస్తే ఎన్నో లాభాలను పొందవచ్చు..!

-

చాలా మంది శివుడిని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది అని భావిస్తారు మరియు ఎన్నో విధాలుగా పూజలు చేస్తారు. ఇంట్లో పెద్దలు శివుడిని పూజించడం వలన ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అని ఎక్కువగా చెబుతూ ఉంటారు. చాలా శాతం మంది సోమవారం శివుడికి ఇష్టమైన రోజు అని భావించి పూజిస్తారు. అంతే కాకుండా మహా శివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగారం చేసి పూజలు నిర్వహిస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఇదే.. ప్రతిరోజు సాయంకాలం శివుడిని పూజించడం వలన కూడా ఎంతో మంచి జరుగుతుంది. ప్రదోషకాలంలో పూజించడం వలన ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా సాయంత్రం 4:30 నుండి 6:00 మధ్య పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది, శివుడు నంది మీద కూర్చుని లోకానికి అదృష్టాన్ని ప్రసాదించే సమయం ఇదే. అందువలన తప్పకుండా శివుడిని పూజించండి. పూజ కోసం బిల్వ పత్రాలు మరియు తెల్లని పూలను ఉపయోగించండి. ఇలా చేయడం వలన చాలా పుణ్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా నీరు, పాలు, పెరుగు, తేనె వంటివి ఉపయోగించి అభిషేకం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది.

చాలా మంది మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు శివుడిని పూజించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత వస్తుంది. అంతే కాకుండా ఎలాంటి పాపాలు చేసినా అవి తొలగిపోతాయి. ఈ విధంగా శివుడిని ఆరాధించి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందండి. అంతేకాక ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులు తో బాధపడుతుంటే తప్పకుండా శివుడుని పూజించండి. ఇలా చేయడం వలన మీకు ఉండేటువంటి సమస్యలు తొలగిపోతాయి. అయితే ఎలాంటి పూజ చేసినా శరీరం మరియు మనసు ఎంతో మంచిగా ఉండాలి అని గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news