తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో మరోసారి చిరుత హడలెత్తించింది. నడక మార్గంలో మరోసారి చిరుత కడలెత్తించింది. అలిపిరి నడక మార్గం లో ఉన్న ఏడవ మలుపు వద్ద తిరుమల శ్రీవారి భక్తులకు చిరుత కనిపించింది. అది చూసి ఒక్కసారి భయంతో తిరుమల శ్రీవారి భక్తులు పరుగులు తీశారు. అక్కడే ఉన్న అధికారులకు భక్తులు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సమాచారం అటవీశాఖ అధికారులు అలగే టీటీడీ పాలకమండలికి చేరింది.

దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి చిరుత కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. అలాగే చిరుత కదలిక పట్ల భక్తులు.. అప్రమత్తంగా ఉండాలని తాజాగా టీటీడీ పాలకమండలి ప్రకటన చేసింది. ఎవరు కూడా ఒంటరిగా వెళ్లకూడదని సూచనలు చేసింది టీటీడీ పాలక మండలి. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గతంలో కూడా తిరుమల నడక మార్గంలో చిరుతలు కలకలం నెలకొన్న సంగతి తెలిసిందే.