బిజెపి పార్టీ నుంచి బయటికి వెళ్తానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారు. బిజెపి పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు రాజా సింగ్. ఈ టార్చర్ కంటే తాను బయటికి వెళ్లడమే కరెక్ట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్… సొంత పార్టీ నేతల పైన ఫైర్ అయ్యారు గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే… ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారని మండిపడ్డారు.

ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలో కూడా యుద్ధం చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు అనుసరిస్తున్న బ్రోకర్ ఇజం వల్ల బిజెపి పార్టీ వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావడం లేదని.. దీనికి కారణం బిజెపి నేతలే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.