మహానందిని ఒకసారి సందర్శిస్తే జన్మ జన్మల పాపాలు పోతాయట..!!

-

ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాలలో ఒకటి మహానంది..నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం నాటిదని అంచనా..ఇక్కడ స్వామివారికి విగ్రహం ఎత్తుగా కాకుండా కిందకు ఉంటుంది..

అందుకు కారణం కూడా ఉంది..పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కిలో వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.

ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్ఛమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయని చెబుతున్నారు..పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో నిర్మలంగా, పరిశుభ్రంగా ఉండటం విశేషం..ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు..

మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రథోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం మరెన్నో ఇక్కడ ఉన్నాయి..మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మజన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దలు చెబుతున్నారు.

సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం..మహానంది లో అనేక గెస్ట్ హౌస్ లు, హోటళ్ళు కలవు. గుడికి సమీపంలో శంభుప్రియ గెస్ట్ హౌస్, బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం, హరితా హోటల్, హోటల్ బాలాజీ, న్యూ ఉడుపి హోటల్, శ్రీ కృష్ణ డీలక్స్ ఏసీ, నాన్ ఏసీ మరియు శివప్రియ లాడ్జ్ మొదలగునవి ఉన్నాయి..

ఇక్కడికి ఎలా చేరుకోవాలి..

మహానంది కి సమీపాన కడప ఎయిర్ పోర్ట్, నంద్యాల రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల నుండి నంద్యాల కు బస్సులు కలవు…ఆటోలు కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version