సంకట మోచన హనుమాన్ ఆలయం విశేషాలు ….!

-

అక్కడ హనుమను పూజిస్తే కష్టాలన్నీ తొలగు తాయని భక్తుల విశ్వాసం. ఆంజనేయుని పేరు వినగానే మనకు తెలియకుండానే ఒక విధమైన భక్తి పారవశ్యo లోకి వెళ్తాము. అటువంటి ఆంజనేయుడు శ్రీ రాముడికి సేవకునిగా తన భక్తి ని చాటుకున్నాడు. అయితే ఆంజనేయుడిని పూజిస్తే సమస్త పీడలు, భయాలు తొలగుతాయని అందరికి తెలిసిన సంగతే. కాశి లోని సంకట మోచన హనుమాన్ యొక్క ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్  లోని కాశిలో ఉన్న గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ గంగా నదిలో వారణ , అశి అనే రెండు నదులు కలుస్తాయి. అశి నది తీరాన కాసి విశ్వేశ్వరుని ఆలయానికి ఉపాలయంగా సంకట మోచన ఆలయం ఉంది. ఈ ఆలయం లో మంగళ, శని వారాలలో విశేష పూజలు జరుపుతారు. ఈ రెండు రోజులు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే ఇక్కడ స్వామిని సేవించినంతనే స్వామి కష్టాలను అన్నిటిని నివారిస్తాడని ఆయనను సంకట మోచన హనుమాన్ అంటారు. ఈ ఆలయం 1900 వ సంవత్సరంలో మదన మోహన్ మాలవ్యా చే నిర్మింపబడింది.

రామాయణ సృష్టి కర్త అయిన తులసి దాసుకి హనుమంతుడు ప్రత్యక్షమై అక్కడ వెలసినట్లు చెప్పాడని ప్రచారం. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ 2006 మార్చ్ 7 న ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. అప్పుడు అధిక సంఖ్యలో భక్తులు గాయాల పాలైయ్యారు. అయినప్పటికీ మరునాడు ఆలయంలో పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం నిర్వహించి ఆ పుస్తకాలను పంచిపెట్టారు. తరువాత ఆలయానికి పొలీస్ రక్షణ ఏర్పాటు చేసారు. ఈ ఆలయ సంమీపంలోనే సీతారామ మందిరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news