శనివారం నాడు కాలభైరవునికి ఇలా పూజ చేస్తే బాధలు తొలగిపోతాయి…!

Join Our Community
follow manalokam on social media

పురాణాల ప్రకారం కాలభైరవుని రూపం ఇలా వచ్చింది. ఒకసారి బ్రహ్మ యొక్క గర్వం అనచివేయడానికి శివుడు హోంకరించాడు. ఆ హుంకారం నుండి ఒక రూపం వెలువడింది. ఆ రూపమే కాలభైరవ స్వామి. శివుని క్షేత్రాల లో కాలభైరవుడు కొలువై ఉంటాడు మరియు క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. కాలభైరవుడిని శనివారంతో కూడిన త్రయోదశి నాడు పూజించాలి లేక కాలభైరవునికి ప్రీతికరమైన రోజులు శనివారం మరియు మంగళవారం నాడు పూజించవచ్చు.

కాలభైరవుడి కి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి . ఇలా చేయడం వల్ల దోషాలు, పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కాలభైరవుడిని పూజించవచ్చు. కాలభైరవ పూజ చేసేవారు నల్లని దుస్తులు ధరిస్తే మంచిది. కాలభైరవ పూజను కాలభైరవ విగ్రహానికి గాని చిత్రపటానికి గాని చేయొచ్చు. కాలభైరవుని అనుగ్రహం పొందాలంటే ప్రదోష కాలంలో ఆయనను పూజించాలి.

ప్రదోష కాలం అనగా సాయంత్రం 5:30 నుండి 6:30. కాలభైరవుని పూజల లో నివేదనకు మినప గారెలు నివేదించాలి. పూజలో శ్రీ కాలభైరవ సహస్రనామ స్తోత్రం, నామావళి , అష్టకం, భైరవ కవచం వంటి స్తోత్రాలు వినడం లేదా చదవడం చేయాలి. ఈ విధంగా కూడా భైరవ అనుగ్రహం పొందవచ్చును. శాస్త్రం ప్రకారం గ్రహ బాధలు దూరం కావాలి అనుకున్న వారు, కాల భైరవ హోమం చేయించుకోవాలి. ఈ హోమం చేయడం వల్ల గ్రహబాధలు తొలగి ఆరోగ్యవంతులుగా ఉంటారు.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...