భక్తి: కార్తీక పూర్ణిమనాడు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలో తెలుసా…?

-

కార్తీక మాసం అంతటా కూడా హిందువులు పూజలు చేసి పరమశివుడిని కొలుస్తారు. తెలుగు మాసాల్లో ఎనిమిదవ మాసమైన కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసంలో ఉపవాసం, రుద్రాభిషేకం, బిల్వ పూజ, విష్ణు విష్ణు సహస్రాబ్ది ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది.

 

 

మనం చేసిన పాపాలను తొలగించి విముక్తి చేస్తుందని కార్తీక మాసం లో ఇలాంటివి అనుసరిస్తూ వుంటారు భక్తులు. దీపం వెలిగిస్తే మన మనసు చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం, పగ వంటి వాటిని తొలగిస్తుంది. అందుకొని కార్తీక మాసంలో తెల్లవారుజామున దీపారాధన చేస్తారు.

అదే విధంగా పవిత్రమైన ఈ మాసంలో ఉసిరికాయ చెట్టుని పూజిస్తారు. దీని గురించి శివ పురాణంలో కూడా ప్రస్తావించబడింది. అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజు భక్తులు 365 ఒత్తులు వెలిగిస్తారు. అయితే ఎందుకు వెలిగిస్తారు అనేది చూస్తే… కార్తీక మాసంలో 365 ఒత్తులని వెలిగిస్తే సంవత్సరంలో ప్రతి రోజూ దీపం వెలిగించిన దానితో సమానం.

కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే కూడా పుణ్యం లభిస్తుంది. అందుకే కార్తీక్ మాసంలో సోమవారాలు ఉపవాసాలు చేస్తారు. అలానే గోపూజ చేస్తే కూడా చాలా మంచిది. నదులు లేదా సరస్సులో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే కూడా చాలా మంచి ఫలితం కనబడుతుంది ఇలా కార్తీక మాసంలో ఈ విధంగా అనుసరిస్తే ఎంతో మంచి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version