ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు లో విచారణ అధికారిని మార్చగా.. తాజాగా డ్రగ్స్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పక్కా ప్లాన్ ప్రకారమే బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసారంటూ ఓ వ్యక్తం సంచలన ఆరోపనలు చేశాడు. ఇందులో భాగంగానే ఈ వ్యవహారం పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఆ వ్యక్తి.
మొత్తం ప్లాన్ అంతా సెప్టెంబర్ 27 వ తేదీన జరిగిందని.. ముంబై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ప్లాన్ లో భాగంగా అక్టోబర్ 2 వ తేదీన క్రూయిజ్ షిప్ పై అధికారుల దాడి.. జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసారంటూ తెలిపాడు. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. కాగా..ఆర్యన్ ఖాన్ అరెస్టు కారణం వెనుక బీజేపీ నేత మోహిత్ కాంభోజ్ అనే వ్యక్తి ఉన్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోహిత్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు.