హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారు..?

-

హిందువులందరూ హనుమాన్ జయంతిని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడికి ఎన్నో ప్రత్యేక పూజలను చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీన రావడం జరిగింది. అయితే హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు మేషరాశిలో మంగళవారం నాడు పుట్టడం జరిగింది. అందువలన హనుమంతుడు పుట్టినరోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా రామాయణంలో చెప్పడం జరిగింది కాకపోతే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కూడా హిందువులు హనుమంతుడి పుట్టినరోజుగా భావిస్తారు.

అందువలన పండితులు హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండు సార్లు జరుపుకోవాలని అంటారు. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి నాడున హనుమంతుడుని ఆరాధించడం వలన జీవితంలో ఉండే కష్టాలు, బాధలు తగ్గిపోతాయి. అంతేకాకుండా శ్రీరామనవమితో పాటుగా హనుమాన్ జయంతిని కూడా తప్పకుండా జరుపుకుంటారు. అందువలన ఈ రెండు రోజులను హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. హనుమంతుడు పుట్టినప్పటి నుండి ఎన్నో శక్తులతో ఉన్నాడు. అంతే కాకుండా చిన్నప్పుడు హనుమంతుడికి ఆకలి వేయడం వలన సూర్యుడు ఒక పండు లా కనిపించడంతో సూర్యుడిని తినేయాలని పరిగెత్తడం జరిగింది. ఈ విధంగా సూర్యుడు దగ్గరకు వెళ్లి సూర్యుదుని మింగడానికి హనుమంతుడు ప్రయత్నం చేశాడు.

అందువలన భూమి మొత్తం చీకటితో వ్యాపించింది అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ విషయాన్ని ఇంద్ర దేవుడు తెలుసుకొని హనుమంతుడుని పిడుగుతో కొట్టాడు. దాంతో హనుమంతుడు కింద పడిపోగా, హనుమంతుని తండ్రి పవన దేవుడికి కోపం వచ్చింది. అందువలన భూమి పైన మొత్తం గాలిని నిలిపివేశాడు. ఈ సంఘటన జరగడంతో వాయుదేవుడి కోపాన్ని బ్రహ్మ దేవుడు చల్లార్చాడు మరియు హనుమంతునికి ప్రాణం పోసాడు. అందువలన చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ సంఘటన జరగడంతో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news