కాంగ్రెస్ పార్టీ నూతన ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. అంతు చూస్తామని చంద్ర కిరణ్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బెదిరింపులను నేపథ్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విజయశాంతి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది.

విజయశాంతి బిజెపి పార్టీలో ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం చంద్ర కిరణ్ రెడ్డి చూసుకున్నారట. అయితే కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి చేరిన తర్వాత చంద్ర కిరణ్ రెడ్డి నీ పక్కన పెట్టారట. దీంతో తనకు డబ్బులు చెల్లించాలని విజయశాంతికి చంద్ర కిరణ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చంద్ర కిరణ్ పై విజయశాంతి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.