హనుమాన్ శోభాయాత్రకు సిద్ధమైన హైదరాబాద్… రంగంలోకి 17,000 మంది పోలీసులు

-

హైదరాబాద్ నగరం…హనుమాన్ శోభాయాత్రకు సిద్ధమైంది. భారీ బందోబస్తు మధ్య ఈ శోభాయాత్ర కొనసాగనుంది. 17,000 మంది హైదరాబాద్ పోలీసులు, 3000 మంది ఆర్మీ రిజర్వడ్ పోలీసులు, 800 మంది ట్రాఫిక్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Hyderabad gears up for Hanuman procession

గౌలిగూడలో మొదలై తాడ్ బండ్ లో హనుమాన్ శోభాయాత్ర ముగియనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వద్ద శోభాయాత్ర ముగింపు ఉంటుంది.

  • నేడు హనుమాన్ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
  • ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
  • వాహనదారులకు ప్రత్యామ్నాయ రూట్లను సూచించిన ట్రాఫిక్ పోలీసులు
  • గౌలిగూడ రామ్ మందిర్ వద్ద ప్రారంభమై తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వద్ద ముగియనున్న హనుమాన్ శోభాయాత్ర

Read more RELATED
Recommended to you

Latest news