వేంకటేశ్వరస్వామికి ఏదైనా తియ్యని పదార్థాలు నైవేద్యంగా పెడితే ఈరాశికి అంతా శుభమే! మార్చి 22 రాశిఫలాలు

-

మేషరాశి : అనుకూలమైన రోజు, అన్నింటా విజయం, ధనలాభం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేసుకోండి.

వృషభరాశి : మిశ్రమంగా ఉంటుంది. పనుల్లో జాప్యం,వివాదాలు, దేవాలయ దర్శన సూచన, ఇంట్లో సఖ్యత.
పరిహారాలు: అమ్మవారికి ఎర్రపూల మాలను సమర్పించండి. ఆరావళి కుంకుమను ధరించి బయటకు వెళ్లండి.

March 22nd Friday horoscope

మిథునరాశి : ప్రతికూలమైన వాతావరణం. చెడుపనులు, చెడు ఆలోచనలు. ధననష్టం.
పరిహారాలు: అమ్మవారికి అష్టోత్తర పూజ/పుష్పమాలను సమర్పించండి. వీలైతే పేదలకు సహాయం చేయండి.

కర్కాటకరాశి: అన్నింటా అనుకూలం, పనులు పూర్తి, కుటుంబంలో సఖ్యత, స్నేహితుల సహకారం.
పరిహారాలు: గోవులకు పండ్లు, క్యారెట్, క్యాబేజీ వంటివి తినిపించండి. ప్రదక్షణ చేసి నమస్కారం చేసుకోండి.

సింహరాశి : అన్నింటా వ్యతిరేక ఫలితాలు, అనవసర వివాదాలు, కుటుంబంలో ఇబ్బందలు, సమస్యలు.
పరిహారాలు: చండీ దీపారాధన, ఎర్రవత్తులతో ఇంట్లో అమ్మవారి ముందు దీపారాధన చేయండి సమస్యల తీవ్రత తగ్గుతుంది.

కన్యారాశి : అనుకున్నవి పూర్తి, కార్యజయం, ధనలాభం, సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఎర్రవత్తులతో అమ్మవారికి దీపారాధన చేయండి.

తులారాశి : అన్నింటా వ్యతిరేకం. పనుల్లో జాప్యం, బంధువులతో జాగ్రత్త. ఆర్థిక ఇబ్బంది.
పరిహారాలు: అమ్మవారికి అష్టోతర పూజ చేయించండి. ఎర్రపూలతో అర్చన మంచిది.

వృశ్చికరాశి : భయం, ఆందోళన, విరోధాలు, ఆకస్మిక ధననష్టం.
పరిహారాలు: మీ దగ్గర్లోని దేవాలయంలో శివాభిషేకం లేదా మారేడుదళాలతో అష్టోతర పూజ చేయించండి.

ధనస్సురాశి : అన్నింటా అనుకూలం, లాభం, కార్యజయం, కీర్తిప్రతిష్టలు.
పరిహారాలు: దుర్గాదేవికి అర్చన చేయించండి లేదా దేవాలయంలో పూలమాలను సమర్పించండి.

మకరరాశి : చెడు ఫలితాలు, ధననష్టం, వ్యసనాలతో ఇబ్బందులు, కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పూజ చేయించండి లేదా పొంగలి లేదా రవ్వకేసరి నైవేద్యం సమర్పించి అందరికీ పంచండి.

కుంభరాశి : వ్యతిరేక ఫలితాలు, అధిక ఖర్చులు, విరోధాలు, మనఃశాంతి ఉండదు.
పరిహారాలు: నవగ్రహ ప్రదక్షణలు, అమ్మవారికి అష్టోతర పూజ చేసుకోండి.

మీనరాశి : చిన్నచిన్న ఇబ్బందులు, మానసిక అశాంతి, చికాకులు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి ఏదైనా తియ్యని పదార్థాలు, పండ్లు నైవేద్యంగా పెట్టండి పనులు పూర్తి అయ్యే అవకావం ఉంటుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version