శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ?

-

చైత్ర పౌర్ణిమ రోజున శ్రీ హనుమాన్ జయంతి (తెలుగు రాష్ట్రలలో కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున చేసుకుంటారు) అంటే ఏప్రిల్‌ 8న వచ్చింది. అయితే ఈ సందర్భంగా హనుమంతుడి గురించిన విశేషాలు తెలుసుకుందాం…


హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. ఆంజనేయస్వామికి ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పక సకల జయాలు కలుగుతాయిని పండితులు పేర్కొంటున్నారు.

అదేవిధంగా మనిషిలో సంకల్ప బలానికి ధైర్యాన్నిచ్చే హనుమత్‌ కథా శ్రవణం కూడా మానసిక బలాన్ని ఇస్తుంది. సుందరాకాండ పారాయణం లేదా యూటూబ్‌లలో వచ్చే వాటిని పెట్టుకుని మనస్సు లగ్నం చేసి ఆ పారాయణం చేసినా తప్పక ఫలితం కలుగుతుంది. కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు మన హనుమంతుడు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news