వాస్తు శాస్త్రం | Vasthu Shastram : ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ధన నష్టం మొదలు అనారోగ్య సమస్యలు వరకు ఇలా ఏదైనా వచ్చినప్పుడు దానికి పరిష్కారం చూపించుకోవటం మంచిది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు సరిగా లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయని దీని వల్ల మనిషి జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి అని అంటున్నారు పండితులు.

అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మంచి కలుగుతుంది.. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు వాస్తు దోషాలు తొలగించుకోవడానికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూద్దాం. లివింగ్ రూమ్ లో రాబందు ఫోటో పెట్టుకోవడం వల్ల సమస్యకి పరిష్కారం దొరుకుతుందని.. తప్పక విజయం అందుతుందని పండితులు అంటున్నారు.
పూర్వ కాలం నుండి కూడా రాబందుకి ఎంతో విశిష్టత ఉంది. ఎంతో విశిష్టమైన రాబందుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అదే విధంగా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో వాస్తు దోషాలు వున్నా, బాధలు ఉన్నా, ఆర్ధిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. లేదా ఇంట్లో పెయింటింగ్ కూడా వేయించుకోవచ్చు. రాబందు ఫోటోని పెయింటింగ్ వేయించుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలా సులువుగా బాధల నుంచి బయటపడి ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.