ఇంట్లో అకారణంగా ఒకరినొకరు నిందించుకుంటున్నారా..? దుష్టశక్తి ఉన్నట్లే

-

ప్రతికూల: ఇళ్లు అనేది సంతోషాల నిలయం.. రోజంతా బయట కష్టపడి పనిచేసి ఇంటికి రాగానే హాయిగా అనిపించాలి.. చేసిన కష్టం అంతా మరిచిపోయి ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు ఇళ్లే పెద్ద సమస్యగా మారుతుంది. ఇంట్లో ఉండబుద్ధి కాదు.. ఇంటికి అసలు రావాలనిపించదు. అలాంటి ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తి) చేరి ఉండొచ్చు. నెగెటివ్ ఎనర్జీ చేరినపుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలా తెలుసుకోవాలనే విషయాలు తెలిస్తే మనం జరగబోయే నష్టాన్ని ముందే అంచనా వేయొచ్చు. ముందు మీ ఇంట్లో జరుగుతుందో లేదో చెక్ చేసుకోండి..!

 

దుష్ట శక్తికి సంకేతాలు

అర్థరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది.
ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు, పువ్వులు చనిపోతాయి.
ఇంట్లో చాలా ఎక్కువగా సాలీడ్లు చేరుతాయి. అనేక చోట్ల సాలే గూడ్లు కనిపిస్తాయి.
తరచుగా పాలు పొంగి పోవడం, లేదా మాడి పోవడం లేదా చేతిలో నుంచి జారి ఒలికి పోవడం వంటివి జరుగుతుంటాయి.
ఒక తెలియని బాధ కుటుంబాన్ని వెంటాడుతుంటుంది. అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి.
తరచుగా ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకవడం కోపతాపాల్లో రోజులు గుడుస్తుంటాయి.
ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి
ఇంట్లో ఉన్నపుడు నిరంతరాయంగా తలనొప్పి గా ఉంటుంది.
ఏదో ఒక ట్యాప్‌ నుంచి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి.
కిటికీలు, తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్ధం చేస్తాయి.

మనం రోజువారీ తెలిసీ తెలియక చేసే పనులు, కాస్త ఆశ్రద్ధ వంటివి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరడానికి కారణాలవుతాయి. ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు..

ఇంట్లో వస్తువులు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలెయ్యకూడదు. ఇల్లెప్పుడు ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. అన్ని సర్దిపెట్టుకోవాలి..

మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి.

దేవుళ్ల విగ్రహాలను ఎదురెదురుగా పెట్టుకోకూడదు. పక్కపక్కన లేదా వెరువేరుగా పెట్టుకోవాలి.

పరిహారాలు
వాష్ రూమ్‌లో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి.

ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చెయ్యడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ఇంట్లో తరచుగా ఉప్పు దీపం వెలిగించాలి.

ఇల్లు తుడిచే నీటిలో అప్పుడప్పుడు కాస్త సముద్రపు ఉప్పు వేయాలి.

ఇంట్లో కర్పూరం తో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి.

ఇంట్లోకి గాలి వెలుతురు ధారలంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

వాడని వస్తువులు, పుస్తకాలు, దుస్తుల వంటి వాటిని వదలించుకోవాలి.

ఇల్లు నిశ్శబ్ధంగా ఉంటే చాలా మందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు పాటలో, మంత్రమో ఏదో ఒకటి పెద్ద సౌండ్‌తో ఇంట్లో మోగిస్తే మంచిది.

ఇంట్లోని సోఫాలు, దీవాన్ల వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇల్లు బోర్ కొట్టకుండా కొత్తగా ఉంటుంది. నెగెటివిటి కూడా చేరదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version