మేడ్చల్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి, సీఈఓ దేవ సహాయం, జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి లతో కలసి హాజరయ్యారు జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ సమావేశంలో హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను ముందు స్థానికులకు కేటాయించాలన్నారు.
కట్టిన ఇళ్ళలో 10 శాతం మాత్రమే మనకు ఇచ్చి మిగిలినవి బయట వ్యక్తులకు ఇస్తామనడం దారుణం అని.. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని.. ప్రజలలోకి తీసుకు వెళ్లి మంత్రి వైఖరిని ఎండగడతాం అన్నారు. సమావేశంలో మంత్రిని నిలదీశారు హరి వర్ధన్ రెడ్డి. దీంతో సమాధానం చెప్పలేక సమావేశం నుంచి జారుకున్నారు మంత్రి మల్లారెడ్డి.