నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే.. చూసేందుకు ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది కదా.. అసలు నెమలి అందమే అందం. దాన్ని అలా ఎంత సేపైనా చూడాలనే ఎవరికైనా అనిపిస్తుంది. ఇక కొందరైతే నెమలి ఫించాలను సేకరించి ఇంట్లో పెట్టుకుంటుంటారు. కొందరు వాటిని పుస్తకాల్లో దాచుకుంటారు. అది వారికి సరదా అనిపిస్తుంది. అయితే.. సరదా కోసమే కాదు.. నిజంగా నెమలి ఫించాన్ని దాచుకోవడం వల్ల వాస్తు ప్రకారం.. మనకు అనేక లాభాలు కలుగుతాయట. అవేమిటంటే…
1. రాత్రి పూట నిద్రించేటప్పుడు దిండు కింద నెమలి ఫించాన్ని పెట్టుకుంటే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పోతాయట. పీడకలలు రాకుండా ఉంటాయట.
2. ఇంట్లో బెడ్‌రూంలో తూర్పు లేదా ఈశాన్య మూలలో నెమలి ఫించాన్ని పెట్టుకుంటే.. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయట. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారట. అలాగే ఏవైనా పనులు పెండింగ్‌లో ఉంటే త్వరగా పూర్తవుతాయట.
3. చదువుల్లో వెనుకబడే విద్యార్థులు పుస్తకాల్లో నెమలి ఫించాలను పెట్టుకుంటే.. చదువుల్లో బాగా రాణిస్తారట.
4. ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటం ఎదురుగా నెమలి ఫించం ఉంచితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ పోతాయట.
5. నవగ్రహాల్లో ఏవైనా గ్రహాల సమస్యలు, దోషాలతో ఇబ్బందులు పడే వారు నెమలి ఫించంపై కొద్ది కొద్దిగా నీరు పోస్తూ.. 21 సార్లు ఆ గ్రహానికి చెందిన మంత్రాలను చదవాలి.ఆ తరువాత నెమలి ఫించాన్ని పూజగదిలో ఉంచి మరుసటి రోజు నీటిలో ముంచాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు పోతాయట.