పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్ మారిపోతుంది. పెళ్లి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే భార్య భర్తల మధ్య అనేక ఇబ్బందులు వస్తాయి. పెళ్ళికి ముందే మీతో అన్ని విషయాలు చెప్పకుండా ఉన్నా కొన్ని విషయాలని రహస్యంగా ఉంచుతున్నా.. అబద్ధాలు చెప్తున్నా.. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. అలాగే పెళ్ళికి ముందు మరికొన్ని విషయాలను కూడా చూసుకోవాలి. పెళ్లి చేసుకోవడానికి ముందు పార్ట్నర్ కుటుంబ సభ్యుల్ని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు నచ్చకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం మంచిది. కేవలం అందాన్ని మాత్రమే చూసి చాలా మంది పెళ్లి చేసుకుంటుంటారు. కానీ అలా చేయడం వలన భవిష్యత్తులో మీరే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
కేవలం అందాన్ని మాత్రమే చూసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచి పద్ధతి కాదు. కొంతమంది అమ్మాయిలు పైకి చాలా అందంగా కనిపిస్తారు మానసికంగా సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయి. మీ నుంచి రహస్యంగా కొన్ని విషయాలని ఉంచుతున్నట్లయితే కూడా వారికి దూరంగా ఉండటం మంచిది. అలాంటి వాళ్ళను పెళ్లి చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా బలహీనత ఉంటుంది బయటకు చెప్పకపోతే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది. ఏదో ఒక విషయంపై నిత్యం వాదనలు చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం మంచిది మూర్ఖంగా వాదించే వారితో భవిష్యత్తులో సమస్యలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. జీవితాంతం అన్ని సందర్భాల్లో తోడుగా ఉండాలి. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది.
పెళ్లికి ముందే అమ్మాయి మీకు సమయం ఇవ్వగలరా లేదా అనేది చూసుకోండి అమ్మాయి మీకు కాస్త సమయాన్ని ఇవ్వాలి. ఆమె పనుల్లో బిజీగా ఉంటూ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఆమెకు దూరంగా ఉండటం మంచిది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. మిమ్మల్ని వారు మిమ్మల్ని గౌరవించుకుంటే ఎంతో సంతోషంగా ఉండొచ్చు. అలాంటి వారిని పెళ్లి చేసుకోవచ్చు మీపై ప్రేమ ఉండి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే పెళ్లి చేసుకోండి. బలవంతంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నట్లయితే అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది.