ప్రేమలో విఫలం అయ్యారా..? అయితే ఈ తప్పులు అస్సలు చెయ్యకండి..!

-

ప్రేమలో అందరూ సక్సెస్ అవ్వలేరు. కొందరు ప్రేమలో విజయం పొందితే మరి కొందరు విఫలమవుతుంటారు. నిజానికి ప్రేమలో విఫలం అవడం అనేది చాలా బాధగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఇద్దరూ ఎక్కువ సమయాన్ని ఒకరితో ఒకరు గడపడం.. అన్ని వేళలా ఇద్దరూ కలిసి ఉండడం.. అన్నిటిని షేర్ చేసుకోవడం ఇలాంటివి మీ మధ్య ఎక్కువగా జరిగినప్పుడు ఆ బ్రేకప్ ని తట్టుకోవడం చాలా కష్టం.

 

పైగా ఎంతో బాధగా ఉంటుంది. పైగా ఎల్లప్పుడూ వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ మనలో ఉంటుంది. ఏళ్ల కొద్దీ మీరు రిలేషన్షిప్ లో ఉండి ఒక్కసారిగా విడిపోవాల్సి వస్తే దానిని అస్సలు తట్టుకోలేము. మీ ప్రేమ కూడా విఫలం అయిందా..?

అయితే బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బ్రేకప్ అయిన తర్వాత మీరు మీయొక్క మాజీ ప్రియుడిని లేదా ప్రియురాలిని మర్చిపోవాలంటే వీటిని అస్సలు చేయకండి. ఈ తప్పుల కనుక చేశారంటే ఈ సమస్యలు తప్పవు.

పాత మాటలకి వెళ్ళకండి:

పదే పదే పాత విషయాలను తలుచుకోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే మీరు మీ యొక్క రిలేషన్షిప్ అయ్యి పోయింది అని గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ లో పాత ఫోటోలు, పాత చాటింగ్ ని చూసి అనవసరంగా ఇబ్బంది పడొద్దు. వీటివల్ల మీకు మరింత బాధ కలుగుతుంది.

వాళ్ల ప్రొఫైల్ ని చూడడం లాంటివి చేయొద్దు:

పదేపదే వాళ్ళ ప్రొఫైల్ ని చూడడం.. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ ని చూడటం లాంటివి చేయకండి. దీని వల్ల మీకు బాధ కలుగుతుంది. అలానే మర్చిపోవడం కూడా కష్టమవుతుంది .

స్నేహితుల్లా ఉండకండి:

చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత స్నేహితులుగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఇది జరగని పని గతాన్ని మరిచిపోయి స్నేహితుల్లా ఉండటం కుదరదు. కాబట్టి మీరు ఫ్యాక్ట్ ని తెలుసుకుని ఇలా ఈ తప్పులు చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version