వైఎస్సార్ పార్టీ అధికారంలో ఉండగా 100 కోట్ల చేస్తున్న పనుల్లో 30 శాతం పనులు పూర్తి చేసాము. కానీ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిలేదు అని YCP రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రబడ్జెట్ లో అప్పులు 6 లక్షల 46 వేల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉంది అని కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ టీడీపీ అధికారం నుండి 2019 నాటికి 4 లక్షల కోట్లు అప్పు పెట్టి పోయారు. వైఎస్సార్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో 2 లక్షల 46 కోట్లు అప్పు చేసింది.
ప్రొద్దుటూరు కు వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం లో 23 వేల మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసింది. మేము ఇంటి పట్టాల పంపిణీలో ఇండ్ల నిర్మాణం లో తప్పు చేసి ఉంటే మా పై విచారణ చేయించు పెద్దాయన. 2014 నుండి 2019 నాటికి 4150 టిడ్కో స్కీం లో ఒక్క ఇంటి నిర్మాణాలు పూర్తి చేయలేదు. సూపర్ సిక్స్ అమలు పై ప్రజలకు జవాబు చెప్పండి ఎమ్మెల్యే గారు అని శివ ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.