మనకి మంచి రోజులు రాబోతున్నాయని ఎలా తెలుస్తుంది..?

-

ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు రెండు జరుగుతుంటాయి ఒక్కోసారి మంచి రోజులు ఉంటే ఒక్కొక్కసారి ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే గరుడ పురాణం ప్రకారం మనకి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి చూద్దాం. మన ఇంటికి కనుక రోజు ఆవు వస్తున్నట్లయితే లక్ష్మీదేవి కరుణించినట్లు. ఆవు మన ఇంటికి రోజు వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నాయని దానికి సంకేతం.

పక్షి కనుక మన ఇంట్లో గూడి కట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలిగినట్లు మంచి రోజుల త్వరలో రాబోతున్నట్లు దానికి అర్థం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కనుక మెలకువ వచ్చి తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పట్టిస్తున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం వచ్చినట్టుట. ఇంట్లో చిన్న పిల్లలు నిత్యం నవ్వుతూ ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నట్లు అర్థం. కలలో నక్షత్రం శంఖం లేదంటే ఏనుగు ముంగిస వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నట్లు దానికి సంకేతం.

ఇలా వీటి ద్వారా మనం మంచి రోజు త్వరలో వస్తున్నట్లు తెలుసుకోవచ్చు. పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఏదైనా తింటున్నట్లు కనిపిస్తే కూడా మంచి జరగబోతున్నట్లు దానికి సంకేతం అని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి గరుడ పురాణం ప్రకారం ఇది మంచి జరగడానికి సంకేతాలు ఇటువంటివి జరిగితే ఖచ్చితంగా ఏదో మంచి జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. అయితే ఏదో ఒక రోజు మంచి వస్తుంది కదా అని మనం ఎదురు చూడటం కంటే మనకి తోచినది మనం కష్టపడితే కచ్చితంగా ఏదో ఒకనాడు మంచి పొజిషన్ లో ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news