మీ టూత్‌ బ్రష్‌ను ఎన్ని నెలలకు ఒకసారి మారుస్తున్నారు..?

-

ఉదయం లేచిన తర్వాత అందరూ మొదటగా చేసే పని బ్రష్‌ చేయడం.. అంటే.. కాసేపు ఫోన్‌ ఎలాగూ చూస్తాం కానీ..అది పని కాదుగా..! టూత్‌ పేస్ట్‌, టూత్‌ బ్రష్‌ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పేస్ట్‌ వాడుతున్నాం, ఎలాంటి బ్రష్‌ వాడుతున్నాం..మన వయసును బట్టి బ్రష్‌ సెలక్టు చేసుకోవాలని మీకు తెలుసా..? టూత్ బ్రష్ విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్ల మీరు ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు.

కొంతమంది టూత్‌పేస్టులని మారుస్తారు కానీ బ్రష్‌ని మార్చరు. ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నోటి సమస్యలు తలెత్తుతాయి. టూత్ బ్రష్‌ను తరచుగా మార్చడం చాలా ముఖ్యం. మీరు బ్రష్‌ను నిర్దిష్ట సమయం కంటే ఎక్కువసేపు ఉపయోగిస్తే, అది దంతాలు, చిగుళ్లకు హానికరం.

సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రకారం, ప్రతి ఒక్కరూ తమ టూత్ బ్రష్‌ను ప్రతి 3 నుండి 4 నెలలకు మార్చుకోవాలి. కానీ మీ బ్రష్ అంతకు ముందు పాడైతే, మీరు దానిని 3 నెలల ముందే మార్చేయాలి.

టూత్ బ్రష్ త్వరగా పాడవకుండా ఉండేందుకు వీలైతే ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన బ్రష్‌ని కొనుగోలు చేయండి. టూత్ బ్రష్ ముళ్ళగరికెలు దంతాలను శుభ్రపరచడంలో, సూక్ష్మ జీవులను తొలగించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల ముళ్ళలో పెళుసుదనం ఏర్పడుతుంది. దీని వలన అవి సరిగ్గా పనిచేయవు.

మీరు అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు.. ఆ సమయంలో ఉపయోగించిన బ్రష్‌ను మార్చాలి. ఎందుకంటే వ్యాధి ఉన్నప్పుడు ఉపయోగించే టూత్ బ్రష్‌పై చాలా సూక్ష్మక్రిములు ఉంటాయి. కాబట్టి అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత..కొత్త టూత్ బ్రష్‌ని ఉపయోగించాలి.. జ్వరం వచ్చినా సరే.. తగ్గిన తర్వాత.. బ్రష్‌ మార్చుకోవాలి. కొంతమంది బ్రష్‌ చేసేప్పుడు టూత్‌ బ్రష్‌ను నములుతారు.. ఇలా అస్సలు చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news