వైఎస్ భాస్కరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

-

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వై.ఎస్‌.భాస్కర్​ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను న్యాయస్థానం ఈనెల 5కు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది. భాస్కర్​ రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఇక ఇటీవలే ఎంపీ అవినాష్​ ముందస్తు బెయిల్​ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది.

‘‘సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో నా పాత్రకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవు. సాక్ష్యాల చెరిపివేతలో నాకు ఎలాంటి సంబంధంలేదు. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా నన్ను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. అంతేకాకుండా నా ఆరోగ్యం సరిగా లేదు’’ అని భాస్కరరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో కుట్రతోపాటు సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ భాస్కరరెడ్డిని సీబీఐ ఏప్రిల్‌ 16న అరెస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news