ఇలా చేస్తే చాలు.. దిష్టి మొత్తం పోతుంది..!

-

కొంతమంది ఎదుట వాళ్ళ ఎదుగుదలని చూసి కుళ్ళిపోతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. అలా జరగడం వలన దిష్టి తగులుతూ ఉంటుంది. మన మీద చెడు ప్రభావం పడడం వలన మనకి ఇబ్బందిగా ఉండడం నీరసంగా అనిపించడం లేదంటే దిష్టి కారణంగా మనం సతమతమవడం వంటివి చోటు చేసుకుంటాయి. అయితే దిష్టి పోవాలంటే ఇలా సులభంగా దిష్టిని తొలగించుకోవచ్చు మరి ఇక ఎదుట వాళ్ళు మీ మీద ఏడుస్తున్నట్లు అయితే ఆ దిష్టి పోవాలంటే ఈ విధంగా పాటించడం మంచిది.

స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని మీరు నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే దిష్టి అంతా కూడా పోతుంది ఇలా చేస్తే త్వరగా దిష్టి నుండి బయటకు వచ్చేయొచ్చు. నరదిష్టి కారణంగా అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు హనుమాన్ చాలీసాని తొమ్మిది సార్లు పారాయణం చేసి హనుమంతుడికి అరటి పండ్లు నైవేద్యం పెడితే ఆ సమస్య నుండి త్వరగా బయటికి వచ్చేయొచ్చు ఎలాంటి బాధలు కూడా ఉండవు.

నర దిష్టి తొలగిపోవాలంటే ఉప్పుతో మూడుసార్లు పైనుండి కిందకి తిప్పి ఆ ఉప్పుని బయట పారేస్తే సరిపోతుంది బూడిద గుమ్మడికాయ అయినా సరే మూడుసార్లు అటు ఇటు తిప్పి ఎవరూ లేని చోట పారేస్తే దృష్టి అంత తొలగిపోతుంది. నర దిష్టి వలన విపరీతమైన సమస్యల్ని చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి తగిలితే అమ్మవారి ఆలయంలో ఎర్రని గాజులు చీర ఇస్తే తొలగిపోతుంది. స్నానం చేసే నీళ్లలో ఉప్పు వేసుకుని స్నానం చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగి హాయిగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version