వాస్తు: మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఈ వస్తువులుని తీసేయండి….!

వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు పండితులు కొన్ని విషయాలను పంచుకున్నారు. మీ ఇంట్లో కనక ఈ వస్తువులు ఉంటే వాటిని తొలగించడం మంచిదని పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి రావాలంటే తప్పకుండ ఇలా చేయమని పండితులు చెప్పడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం పూర్తిగా చూద్దాం.

పండితులు చెప్పిన ఆ సామాన్ల గురించి చూస్తే…. లక్ష్మీదేవి ఇంట్లో లేనప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, అటువంటి సమస్యలు తొలగిపోవాలంటే ఈ వస్తువుల్ని తొలగించండి అని పండితులు అన్నారు.

విరిగిపోయిన అద్దం లేదా పగిలిన అద్దం కనుక మీ ఇంట్లో ఉంటే తప్పకుండా దాన్ని తొలగించడం మంచిది. అటువంటి వాటిని ఎప్పుడూ వాడకూడదు అదే విధంగా మీ ఇంట్లో కనక విరిగిన మంచం ఉంటే దానిని కూడా వాడకండి.

విరిగిపోయిన మంచి ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి రాదు అని పండితులు చెప్పారు. అలానే చాలా మంది ఇళ్లల్లో పనికిరాని వస్తువులు మూలన పడి ఉంటాయి. అటువంటి వస్తువులని ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి రాదు అని పండితులు అంటున్నారు. కాబట్టి అనవసరమైన వాటిని ఇంట్లో నుంచి తొలగించడం మంచిది.

అదే విధంగా విరిగిన ఫర్నిచర్, పగిలిన దేవుడి ఫోటోలు, చెడు ఫోటోలు మరియు పని చేయని ఎలక్ట్రానిక్ సామాన్లు, విరిగిన తలుపులు కనుక మీ ఇంట్లో ఉంటే వాటిని తొలగించడం మంచిది. ఇలా విరిగిపోయిన సామాన్లని, పగిలిపోయిన సామాన్లని ఉపయోగించకూడదు.

ఇటువంటి సామాన్లు కనుక ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది అని చెబుతున్నారు. అదే విధంగా భార్యభర్తల మధ్య వైవాహిక జీవితం కూడా నెగిటివిటీ కి గురవుతుందని ఇంట్లో శాంతి ఉండాలంటే తప్పకుండా ఇటువంటి వాటిని తొలగించడం మంచిది అని పండితులు చెప్తున్నారు.