ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు మరణిస్తారు. అయితే ఈ నిజం అందరికీ తెలుసినా సరే ఆత్మీయులు ఎంతో బాధపడుతూ ఉంటారు. భగవద్గీత ప్రకారం ఈ లోకంలో ఎవరు జన్మించినా ఏదో ఒక రోజు చనిపోవాలి. సనాతన ధర్మం ప్రకారం మృతదేహాన్ని కర్మలతో దహనం చేయడం జరుగుతుంది. మృతదేహాన్ని అగ్నిని ఉపయోగించి దహన సంస్కారాలు చేస్తారు. ఇలా చేసిన తర్వాత శరీర భాగం మొత్తం కాలిపోతుంది. అయితే కాలిపోకుండా ఒక శరీర భాగం మాత్రం అలానే ఉండిపోతుంది.
పండితుల ప్రకారం అంత్యక్రియలు చేసిన తర్వాత కొన్ని గంటల సమయంలోనే ఎముకలతో పాటు మొత్తం శరీరం అనేది కాలిపోతుంది. కాకపోతే దంతాలు మాత్రం కాలిపోకుండా అలానే ఉండిపోతాయి. దంతాలు ఫాస్ఫైట్ మరియు కాల్షియంతో తయారు చేయబడ్డాయి. దీనివలన అగ్ని ఉపయోగించినా సరే అవి కాలకుండా అదే విధంగా ఉంటాయి. ఇదే విషయాన్ని సైన్స్ ప్రకారం చూస్తే దహన సమయంలో సుమారుగా 1229 డిగ్రీల ఫారిన్హీట్ ఉత్పత్తి అవుతుంది. ఆ వేడికి చర్మం నరాలు తో పాటుగా ఎముకలు కూడా కాలిపోతాయి. కాకపోతే అగ్నిలో పంటి మొత్తం భాగం కూడా కాలిపోతుంది.
కాకపోతే దాని పై ఉండే ఎనామిల్ మాత్రం అలానే ఉంటుంది. సహజంగా దహనం చేసిన తర్వాత రెండు రోజులు గడిచాక స్మశాన వాటిక నుండి ఎముకలను తీసుకొస్తారు. ఆ సమయంలో ఎముకలతో పాటుగా కాలిపోకుండా మిగిలి ఉన్న దంతాలు భాగాలను కూడా తీసుకువస్తారు. వీటిని గంగా నది లేక ఎలాంటి పవిత్రమైన నదిలో అయినా కలుపుతారు. చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని ఇలా చేస్తారు, అంటే చివరకు శ్రీహరి పాదాల దగ్గర వారికి స్థానం కలగాలని ప్రార్ధించి ఈ కార్యాలను పూర్తి చేస్తారు.