తెలంగాణలోని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని 4 పథకాలను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మండలానికి ఒక్క గ్రామంలోనే మీ మ్యానిఫెస్టో పంచారా..? ఒక్క గ్రామంలోనే ఓట్లను అడిగారా..? ఒక్క గ్రామం ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచారా..? నాడు అందరికీ అనని అని.. నేడు కొందరికీ కొన్ని అని మబ్య పెడితే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు.
పథకాలు రాని గ్రామాల్లో రేపటి నుంచి ప్రజా రణరంగమే అని ట్వీట్ చేశారు కేటీఆర్. “ఎన్నికలప్పుడు.. రాష్ట్రంలోని ప్రతి మండలం.. ప్రతి గ్రామంలోని.. ప్రతి ఇంటా.. అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. “వన్ ఇయర్” తరువాత “వన్ విలేజ్” అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ప్రతిపక్షంగా ఇంకో నాలుగేళ్లు.. ఓపిక పట్టడానికి మేము సిద్ధం కానీ ఏరు దాటక తెప్ప తగలేసే మీ ఏడాది దగా పాలన చూసిన తరువాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు గుర్తుపెట్టుకోండి. పథకాలు రాని గ్రామాల్లో.. రేపటి నుంచి.. ప్రజా రణరంగమే” అని ట్వీట్ చేశారు కేటీఆర్.
భట్టి గారు…
మండలానికి ఒక గ్రామంలోనే
మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా ?మండలానికి ఒక గ్రామంలోనే
మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా ?మండలానికి ఒక గ్రామంలోనే
మీ ఎన్నికల ప్రచారం చేశారా ?మండలానికి ఒక గ్రామంలోనే
ప్రజలను ఓట్లేయమని అడిగారా ?మండలానికి ఒక గ్రామంలోనే
ఓట్లు వేస్తే… pic.twitter.com/uqsYX38oYL— KTR (@KTRBRS) January 26, 2025