వాస్తు: పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఇలా చేయండి…!

కొందరు పిల్లలలో ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసం ఒక ఉపాయం చెప్పడం జరిగింది. వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు పండితులు పిల్లల గది లో కొవ్వొత్తులు వెలిగిస్తే వాళ్లకి మంచి జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

ఈ పద్ధతిని కనుక పాటించారు అంటే పిల్లలు ఆసక్తిగా చదవడానికి మరియు ఏకాగ్రతని పెంపొందించుకోవడానికి వీలవుతుంది. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం మనం పూర్తిగా చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు వైపున, దక్షిణం వైపున మరియు ఈశాన్యం వైపున కొవ్వొత్తులు వెలిగిస్తే… వాళ్లకి చదువు పైన ఆసక్తి కలుగుతుందని మరియు వాళ్ళు ఏకాగ్రతని పెంపొందించుకోవడానికి కూడా వీలవుతుందని పండితులు చెప్పడం జరిగింది.

అలా అని పొరపాటున మీరు ఉత్తరం వైపు మాత్రం పెట్టొద్దు. ఉత్తరం వైపున కొవ్వొత్తి వెలిగించడం వల్ల మంచి కలుగదు. ఉత్తరం వైపున కొవ్వొత్తి వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అదే విధంగా వాయువ్యం వైపు కూడా కొవ్వొత్తులు వెలిగించవద్దు.

ఇలా ఈ రెండు దిక్కుల్లో మీరు కొవ్వోత్తులని వెలిగించండి వల్ల కుటుంబంలో ఆర్ధిక సమస్యలు వస్తాయని, ఒకరిపై మరొకరికి ఈర్ష్య కూడా కలుగుతుందని పండితులు అంటున్నారు.