వాస్తు: ఆర్ధిక ఇబ్బందుల నుండి ఇలా బయట పడండి..!

కొందరు ఎంత కష్టపడుతున్నా, ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలువదు. డబ్బు త్వరగా ఖర్చు అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు రావడం లాంటివి జరుగుతుంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే మీరు చింతించకండి. ఇక్కడ పండితులు కొన్ని పద్ధతుల్ని చెప్పారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పద్ధతులు పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెప్పడం జరిగింది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.

vasthu for tap water

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ కులాయి కూడా లీక్ అవ్వకుండా ఉండాలని…. లీక్ అవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. ఒకవేళ కనుక మీ ఇంట్లో కూడా ఏదైనా కుళాయి పని చేయకుండా కనుక ఉంటే దానిని మీరు బాగా చేయించండి. అలా నీళ్ళు లీక్ అవ్వడం వల్ల ఇబ్బందులు వస్తాయని… ముఖ్యంగా వంటగదిలో కుళాయి నుండి నీళ్లు కారకూడదని.. దాని వల్ల మంచి కలగదు అని అంటున్నారు.

ఎందుకంటే వంట గదిలో అగ్ని ఉంటుంది. అగ్ని మరియు నీళ్ళు ఒకేచోట అలా ఉంటే ఇబ్బందులు వస్తాయి. వ్యాపారంలో నష్టం కలగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం, కుటుంబసభ్యుల్లో అనారోగ్య సమస్యలు రావడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా కుళాయి నుండి నీళ్ళు అలా కారిపోయేటట్లు ఉంచొద్దు ఈ మార్పుని కనుక చేసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరంగా ఉండొచ్చు.