పిల్లలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి..!

వానా కాలంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులోనూ కరోనా సమయం. ఇటువంటి సమయంలో పిల్లల్ని బాగా చూసుకోవాలి. వీలయినంత వరకు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అయితే కరోనా సమయం మరియు వానాకాలం కాబట్టి మరి కాస్త జాగ్రత్తగా ఉంచాలి. అయితే పిల్లలని ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు చూస్తే..

దోమలు కుట్టకుండా చూసుకోండి:

దోమల వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకి దోమలు కుట్టకుండా చూసుకోండి. దోమ తెర వంటివి కట్టండి. పొడవాటి దుస్తులు వేయండి ఇలా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఇంటి ఆవరణలో కూడా నిలువ నీరు ఉండి పోకుండా చూసుకోండి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని దోమలు కుట్టకుండా జాగ్రత్తపడండి.

పర్సనల్ హైజీన్:

చర్మాన్ని కూడా ఎంతగానో ప్రొటెక్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. భోజనం తినేముందు భోజనం తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలి. అలానే వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా పిల్లలకి సబ్బుతో చేతులు కడగండి. ఇలా వాళ్ళకి పర్సనల్ హైజీన్ నేర్పించండి.

సోషల్ డిస్టెన్స్ పాటించడం:

కరోనా వల్ల ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక ఎక్కువగా బయటకు పంపకండి. ఒకవేళ బయటకు తీసుకెళ్లినా సోషల్ డిస్టెన్స్ పాటించండి. మాస్క్ ధరించడం.. అలానే రోగ నిరోధకశక్తిని పెంపొందించే పద్ధతులను అనుసరించడం కూడా ఎంతో అవసరం.

ఆహారం మరియు నీళ్ళు:

మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండడం వంటివి పాటించండి. నీళ్లు మరిగించి తాగితే మరీ మంచిది.

రెస్పిరేటరీ సిస్టమ్ ప్రొటెక్ట్ చేయండి:

రెస్పిరేటరీ సిస్టమ్ ని సరిగ్గా ఉండేలా చూసుకోండి. ప్రతి రోజు మీ సమయంలో కాస్త సమయాన్ని యోగా మరియు ప్రాణాయామానికి వెచ్చించండి. దీనితో శ్వాస సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.