వాస్తు: ఈ తప్పులు చేస్తే సమస్యలు తప్పవు..!

-

మనం ఇంట్లో వాస్తుని అనుసరించడం వల్ల మనకి శుభం కలుగుతుంది. వాస్తుని కనుక పాటించకపోతే సమస్యలు తప్పవు. అయితే ఈ రోజు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా మంచి కలుగుతుంది. అదే విధంగా ఇబ్బందులన్నీ పోయి ఆనందంగా ఉండొచ్చు.

తూర్పువైపు కనుక వాస్తుని పాటించకపోతే ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజు మనం తూర్పుదిక్కుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మరి ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడు దాని కోసం పూర్తిగా చూసేద్దాం.

తూర్పు వైపున బాగా బరువుగా ఉండే వస్తువులను పెట్టడం మంచిది కాదు. ఒకవేళ కనుక అలా ఉంచారంటే ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఎప్పుడూ కూడా గాలి లోపలికి వచ్చే విధంగా ఉండాలి అలా కాకుండా పాత సామాన్లు మరియు వివిధ రకాల వాటినే తూర్పు దిశలో పెట్టారంటే ఇబ్బందులు తప్పవు.

అలానే ఎప్పుడూ కూడా శుభ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అలా కాదు అని మీకు నచ్చినట్టు మీరు చెత్తగా వదిలేస్తే తప్పకుండా అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోవడంలో అసలు బద్ధకం వద్దు. ముఖ్యంగా తూర్పు దిశలో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోండి ఈ తప్పులు కనుక సరి చేసుకుంటే తప్పకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version