వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే సాధారణంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మరియు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అయితే ఇబ్బందులేమీ లేకుండా ఆనందంగా ఉండాలంటే ఈ విధంగా అనుసరించాలి.
పండితులు చెబుతున్న పద్ధతిని ఫాలో అవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉండి నెగిటివిటీ పూర్తిగా దూరం అయిపోతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అటువంటప్పుడు ఇంట్లో గులాబీ రేకుల్ని పెట్టడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు.
గాజు బౌల్ లో కొన్ని గులాబీ రేకులు వేసి నీళ్లు పోసి ఉంచడం వల్ల తాజా గాలి వస్తుంది. ముఖ్యంగా తూర్పు వైపు ఉండేటట్టు పెట్టడం వల్ల చక్కటి బెనిఫిట్స్ పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఇలా పెట్టడం వలన మంచి గాలి వచ్చి మొత్తం అంతా వ్యాపిస్తుంది. దీనితో ఆనందంగా ఉండొచ్చు అలానే ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి ప్రతి రోజు మీ ఇంట్లో గాజు బౌల్ లో నీళ్లు పోసి.. అందులో గులాబీ రేకుల్ని వేసి పెట్టండి. ఇలా చేయడం వలన పూర్తిగా నెగటివిటీ దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.