వాస్తు: ఇంట్లో నెగటివిటీని దూరం చేసే పద్ధతులు మీకోసం..!

-

ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా…? ఇంట్లో అస్సలు ప్రశాంతంగా లేదా..? అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించాలి అని వాస్తు పండితులు అంటున్నారు. అయితే మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను చూసేయండి.

సాల్ట్:

కొద్దిగా సాల్ట్ తీసుకుని అందులో నీళ్లు కలిపి ఇంట్లో జల్లితే నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అదే విధంగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి కూడా వీలవుతుంది.

గాలి వచ్చేటట్లు చూడడం:

ఉదయం పూట మరియు మధ్యాహ్నం పూట అన్ని కిటికీ తలుపులు తీసుకుని ఉంటే మంచిది. దీని వల్ల స్వచ్ఛమైన గాలి వస్తుంది. దీనితో మంచి ఫ్రెష్ ఎనర్జీ కూడా వస్తుంది.

సూర్యకిరణాలు తగిలేలా చూసుకోవడం

మీ ఇంటి తలుపులు, కిటికీలు, కర్టెన్లు ఉదయం పూట మరియు మధ్యాహ్నం పూట తెలుసుకోండి. దీనితో సూర్యకిరణాలు ఇంటి మీద పడతాయి.

శబ్దాన్ని ఉపయోగించడం:

మంత్రాలు, గంట శబ్దం ఇవన్నీ ఇంట్లో ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది. అలానే మ్యూజిక్ కూడా మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. అదే విధంగా అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది.

లైట్లు ఉపయోగించడం:

నూనె దీపాలు ఇంట్లో పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివిటీ ఉంటుంది అదే విధంగా ఇంట్లో మంచి సువాసన కూడా వస్తూ ఉండాలి. ఇంట్లో అగరబత్తిలని, దూప్ స్టిక్స్ లాంటివి వెలిగించడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇలా ఈ విధంగా కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండి నెగిటివిటీ పూర్తిగా దూరం అయిపోతుంది అని పండితులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version