వాస్తు: వీటిని పాటిస్తే ఇంట్లో సమస్యలు వుండవు..!

చాలా మందికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అటువంటి సమస్య నుండి బయట పడాలంటే నిజంగా కాస్త కష్టం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని పండితులు అంటున్నారు. అయితే మరి వాస్తు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలని మనం చూద్దాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసమే పూర్తిగా చూసేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.

vastu
vastu

ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ డబ్బు సమస్య కానీ ఉన్నట్లయితే చీపురు ఎప్పుడూ కూడా నిలబెట్టి ఉంచకూడదని అంటున్నారు పండితుడు. కాబట్టి ఆర్థిక బాధలు వంటివి ఉండకుండా ఉండాలంటే చీపురుని నిలబెట్టద్దు.
అదే విధంగా ఇంట్లో ఒకేచోట రెండు లేదా అంతకంటే ఎక్కువ చీపురుని వుంచద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి.
అలానే మనం తినే ఆహారాన్ని మొదట ఆవుకి పెట్టాలి. ఇలా చేయడం వల్ల నిజంగా ఎంతో పుణ్యం మరియు ప్రశాంతత ఉంటుంది.
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలంటే రాళ్ల ఉప్పుని తీసుకుని వారానికొకసారి ఇంటిని దానితో శుభ్రం చెయ్యాలి. ఇలా రాళ్ల ఉప్పు తో శుభ్రం చేస్తే చక్కటి ఫలితం పొందవచ్చు.
అదే విధంగా ఎప్పుడూ కూడా మనం దేవుడి దగ్గర అగరబత్తిని, హారతిని వెలిగించినప్పుడు నోటితో దానిని ఊదకూడదు. కేవలం చేతితో మాత్రమే దానిని ఆర్పాలి.
అలాగే ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి మీద కూర్చుని ఎప్పుడు తినకూడదు మంచం మీద కూర్చుని తినడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి రాదు అని పండితులు అంటున్నారు కనుక ఈ తప్పును కూడా చేయొద్దు.
అలాగే ఇంటి లోపాలకి వెళ్లేటప్పుడు షూస్ లేదా చెప్పులు వేసుకోకూడదు దీనివల్ల కుటుంబ కలహాలు వస్తాయి.