బ్యాటింగ్ లో డీలాపడ్డ ఢిల్లీ.. రాజస్థాన్ టార్గెట్ 155

ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 36 వ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ మరియు పృథ్వీ షా విఫలం కావడంతో అతి తక్కువ స్కోరు చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్.

ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 24 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 43 పరుగులు, మరియు యు.ఎస్ వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ హెట్మేర్ 28 పరుగులు చేసి జట్టుకు.. గౌరవప్రదమైన పరుగులను అందించారు. ఇక అటు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో… ముస్తాఫిజుర్ రెహమాన్ రెండు వికెట్లు, భారత యంగ్ బౌలర్ చేతన్ సకరియా రెండు వికెట్లు, త్యాగి ఒక వికెట్ మరియు రాహుల్ తీవెటియ ఒక వికెట్ తీసి ఢిల్లీ నడ్డి విరిచారు. ఇక చేజింగ్ లో భాగంగా 20 ఓవర్లలో 155 పరుగులు చేయాల్సి ఉంది రాజస్థాన్ రాయల్స్. మరికాసేపట్లో ఈ మ్యాచ్ కు సంబంధించిన చేజింగ్ ప్రారంభంకానుంది.