శ్రావణ మాసం లో చేయకూడని పనులేమిటో తెలుసుకోండి

-

ఆగస్టు 9వ తారీఖుతో శ్రావణ మాసం వచ్చేసింది. మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన శ్రావ‌ణ మాసం లో వ్రతాలు, నోములు, పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ మాసంలో ఆచ‌రించాల్సిన నియ‌మాలను పెద్ద‌లు చెప్పిన విష‌యాల‌ను తెలుసుకుందాం. మాంసాహారాన్ని ముట్టుకోకుండా ఉండడం దగ్గర నుండి మద్య సేవించకుండా ఉండడం వరకు కొన్ని నియమాలని పాటించాలి.

Goddess Lakshmi Devi | శ్రావ‌ణ మాసం

పవిత్ర శ్రావణ మాసం గొప్పగా ఉండడానికి చేయకూడని పనులు

  • ముందే చెప్పినట్టు మాంసాహారం, మద్యం సేవించడం తగదు.
  • వంకాయ కూర తినకూడదనే విషయం చాలా మందికి తెలియదు. పురణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని సమాచారం. అందువల్ల శ్రావణ మాసంలో దాన్ని తినకూడదని అంటారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజులలో వంకాయ తినని వాళ్ళు చాలామది ఉన్నారు.
  • శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు. కానీ, పాలను పానీయంగా తీసుకోకూడదు.
  • శివపూజ చేసేవారు రోజూ ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. సూర్యుడు రాకముందే నిద్రలేవడం మంచిది.
  • శివపూజకి ముఖ్యంగా శివుడి అభిషేకానికి పసుపు ఉపయోగించరాదు. చాలామంది ఇది మర్చిపోతుంటారు. కానీ, పసుపు అభిషేకానికి వాడవద్దు.
  • ఈ పవిత్ర మాసంలో మీ మనసు పవిత్రంగా ఉంచుకునేందుకు మీ ఇంటిని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. అన్ని విషయాల్లో సంయమనంగా ఉండాలి.
Lakshmi Devi

పై విషయాలన్ని పాటిస్తూ పవిత్ర శ్రావణ మాసంలో చేయాల్సిన వ్రతాలు, నోములు చేసుకోవచ్చు.

శ్రావణమాసం విశిష్టత, పూజలు, ఆచరించాల్సిన పద్ధతులు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version