శ్రావణమాసం హిందువులకు ఎంతో ప్రాముఖ్యమున్న మాసంగా చెప్పుకుంటారు. ఈ మాసంలో హిందువులు భక్తి,ఉపవాసం నియమాలతో ఈ నెలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఈ మాసంలో, ఆధ్యాత్మికంగా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో శివుడిని,విష్ణువుని,లక్ష్మీదేవిని,ఆరాధిస్తారు. ఇక ఉపవాసాలు పాటించడం, కొన్ని ఆహార నియమాలను కూడా పాటించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి వంటి, పదార్థాలనుకు దూరంగా ఉండమని శాస్త్రం చెబుతుంది దానికి ఒక ధార్మికమైన, శాస్ర పరమైన కారణం ఉంది. ఇప్పుడు ఆ విషయాలు గురించి తెలుసుకుందాం..
మనం తినే ప్రతి వంటలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తినడానికి ఎవరు ఇష్టపడరు. వాటికి వచ్చే టేస్ట్ అలాంటిది. ఈ రోజుల్లో పిల్లలు అయితే ఇవి లేకుండా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మరి ఈ శ్రావణ మాసంలో వీటికి దూరంగా ఉండడానికి కారణం ఉంది. ముఖ్యంగా ఉల్లి,వెల్లుల్లి వంటివి తామసిక ఆహారాలుగా పెద్దలు పరిగణిస్తారు.
శ్రావణమాసం అంటేనే వర్షాకాలం లో వస్తుందన్న విషయం మనకు తెలిసిందే మరి వాతావరణం చల్లగా తేమగా ఉన్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత పెంచే ఆహారాలైన ఉల్లి,వెల్లుల్లి తీసుకోవడం వల్ల అవి జీర్ణవ్యవస్థ పై మరింత భారం మోపవచ్చు. అందుకే ఈ మాసంలో వాటిని దూరంగా ఉంచుతారు.
ఇక వర్షాకాలంలో సహజంగానే మన జీర్ణవ్యవస్థ కొంచెం బలహీనంగా ఉంటుంది.బయట వాతావరణం వానలతో చల్లగా ఉండడం తో శరీర జీవక్రియ నెమ్మదిస్తుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ రెండు పదార్థాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయన్న ఉద్దేశంతో ముఖ్యంగా గ్యాస్,అజీర్తి, కడుపులో మంట లాంటి సమస్యలు వస్తాయని, వీటిని ఈ టైంలో తినద్దని సూచిస్తారు.
ఇక ధార్మికమైన శాస్త్రాల ప్రకారం చూస్తే, సముద్ర మదనం జరిగే టైంలో రాహువు అమృతం సేవించేటప్పుడు, మహావిష్ణువు ఆయన సుదర్శన చక్రంతో రాహువు శిరస్సును ఖండించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ టైం లోరాహువు శిరస్సు ఖండించినప్పుడు అతని శరీరం నుంచి పడిన రక్తం నుండి ఉల్లి,వెల్లుల్లి పుట్టాయని పురాణాలలో చెబుతారు. అందుకే వాటిని ఇలాంటి పవిత్రమైన మాసంలో తినకూడదని, వాటిని తామసిక ఆహారంగా పేర్కొంటూ, అవి తినడం వల్ల మన మనసులో ఉద్రేకాన్ని, అలసత్వాన్ని కలిగిస్తాయని ఆధ్యాత్మికంగా సాధన చేసేవారు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.