దేశంలోనే తలసరి ఆదాయంలో ఇవాళ తెలంగాణ ముందుండటానికి కారణం నేను తీసుకొచ్చిన ఐటీనే అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన సింగపూర్ తెలుగు డయాస్పోరా ప్రోగ్సామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. లేకుంటే ఇప్పటికే అమరావతి పూర్తి అయ్యేదని తెలిపారు. తాను తీసుకొచ్చిన ఐటీలో పని చేసిన నాదేండ్ల సత్య పని చేస్తూ.. ఇప్పుడు సీఈవో అయ్యారంటే ఆయన కష్టపడ్డ విధానం అలాంటిది అన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడం కోసమే సింగపూర్ కి వచ్చానని తెలిపారు సీఎం చంద్రబాబు. ఐటీ రంగంలో తెలుగు వారందరూ ముందున్నారు. పీ4 విధానం తీసుకొస్తే.. పేదలు లేకుండా చేయాలన్నారు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆర్థిక సంస్కరణలను ప్రమోట్ చేసిన మొదటివాడిని. 1995లో సీఎం కాగానే తానే అమలు చేశానని తెలిపారు. ప్రైవేట్ సెక్టార్ లో పవర్ ప్రాజెక్ట్, ఎయిర్ పోర్ట్ తీసుకురావడం తనకే చెందుతుందన్నారు. 2029 వరకు ఎవ్వరూ పేదవాడిగా ఉండకుండా సాధిస్తామని తెలిపారు.