పురాణాల ప్రకారం నందీశ్వరుడు మార్కండేయుడి కి శివుని గురించి వివరించినదే శివ పురాణం. ఈ శివ పురాణాన్ని చదవడం వల్ల చాలామందికి ఎంతో మంచి జరిగింది. ఋషులు సైతం శివుని అనుగ్రహం పొందడానికి ఈ శివ పురాణాన్ని పాటించేవారు. ఈ విధంగా వారు శివుడిని ప్రార్థించే వారు.
అయితే కలి యుగం లో శివ పురాణం చదవడం వల్ల ఏమి ఉపయోగం అనుకుంటున్నారా? కలియుగం లో శివ పురాణాన్ని చదవడం వలన చాలా త్వరగా పాప విముక్తులును చేస్తుంది. దాంతో పాటు మీరు సకల ఐశ్వర్య వంతుడిగా మారుతారు అని శివ పురాణం చెబుతోంది.
అంతే కాదు శివ పురాణాన్ని అనుసరించడం వల్ల లేదా వినడం వల్ల మరియు పారాయణ చేయడం వల్ల శివానుగ్రహం తప్పకుండా ఉంటుందని ఈ పురాణం చెబుతోంది. శివ ఆరాధనకు మించిన తరుణోపాయం ఏమి లేదని, పాపాలు పోగొట్టుకోవడానికి ఇదే మంచి మార్గమని సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే స్వయంగా చెప్పారు.
మంచి భార్య కావాలన్నా, యోగ్యుడైన భర్త కావాలన్నా , మంచి సంతానం కావాలన్నా, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి మరియు మోక్షం పొందాలనుకున్న శివుడిని ఆరాధించడమే మంచి మార్గమని విష్ణువు బ్రహ్మ కు ఉపదేశించారు. కాబట్టి కలియుగంలో మనం కూడా ఈ పురాణాన్ని చదవడం ఈ సోమవారం నుండే ప్రారంభించి మహిమను పొందుదాం.